
బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ
బ్రహ్మర్షి పిరమిడ్ కట్టడానికి మూల కారణం మరియు మా కుటుంబానికి గురువు.. శ్రీ సుభాష్ పత్రీజీ గారు వారు 1947లో నిజామాబాద్ లోని బోధన్ లో షక్కర్ నగర్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన ఎంతో కృషి చేసి ఈ ప్రపంచానికి 'శ్వాస మీద ధ్యాస' ధ్యాన పద్ధతిని అందించారు. పిరమిడ్ అనే ప్రాచీన మహా కట్టడం ధ్యాన సాధనకు ఎంత ఉపయోగకరమో తెలియజేశారు. ఎంతోమంది పిరమిడ్ ధ్యానం ద్వారా ప్రయోజనం పొందారు. భూమి మీద ఆధ్యాత్మికతను విస్తరించడానికి ఆయన నేర్చుకున్న సత్యాన్ని ఆచరించి చూపించారు. ఆధ్యాత్మికత అనేది ప్రస్తుత జీవితంలో ఎంత అవసరమో వారి బోధనల ద్వారా తెలియజేశారు.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్(PSSM) ను పత్రీజీ 1990 లో స్థాపించారు . ఈ PSSM వ్యవస్థ ధ్యాన విజ్ఞానం, ఆత్మవిజ్ఞానం ,శాకాహార విజ్ఞానం ,మరి మానవులలో పరిపూర్ణమైన మార్పుల కోసం ..మరి సంపూర్ణ ఆధ్యాత్మిక జాగరూకత కోసం... కంకణం కట్టుకుని, భారతదేశం లోని ప్రతి ప్రాంతంలోనూ నిరంతరం నిర్విరామంగా, అవిశ్రాంతoగా పరిశ్రమిస్తోంది.
సరిక్రొత్త విధంగా నవ్య ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ,శాకాహార విశిష్టతనూ మరి పిరమిడ్ శక్తి యొక్క అవగాహననూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కలుగజేయడమే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ యొక్క లక్ష్యం .
పత్రీజీ గురించి మరింత తెలుసుకునెందుకు www.pssm.org వెబ్సైట్ ను సందర్శించగలరు.
ధ్యానం
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాసను గమనించడం ద్వారా మనలోని దేవుడిని మనం తెలుసుకోవడం, కలుసుకోవడం. దీనినే ఆనాపానసతి ధ్యానం అంటారు.
హాయిగా సుఖాసనంలో కూర్చుని చేతులు రెండూ కలిపి, వ్రేళ్ళల్లో వ్రేళ్లు పెట్టుకొని, కళ్ళు రెండూ మూసుకొని సహజంగా జరిగే ఉచ్వాస , నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి... ఏ మంత్రాన్నీ జపించరాదు.... మధ్య మధ్యలో వచ్చే ఆలోచనలను విడిచి పెట్టి మళ్ళీ మళ్ళీ శ్వాసనే గమనిస్తూ ఉండాలి. మెల్లిమెల్లిగా ఆలోచనలు స్థితి కలుగుతుంది. అదే ధ్యానస్థితి. ధ్యానం పిరమిడ్ క్రింద చేస్తే మూడు రెట్లు శక్తి అధికంగా పొందవచ్చు. ఈ ధ్యానం ఏ వయస్సు వారైనా,ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. ఎవరి వయస్సు ఎంత వుందో అన్ని నిమిషాలు విధిగా ప్రతి రొజూ ధ్యానం చేయాలి.
ధ్యానం చేసే విధానం


పిరమిడ్
పిరమిడ్ అంటే మన చుట్టూ ఉన్న విశ్వశక్తిని త్వరగా మరియు ఎక్కువగా మనకు చేర్చే ఒక కట్టడం. సాధారణ ధ్యానం కన్నా పిరమిడ్ లో చేసే ధ్యానం 3 రెట్లు అధిక శక్తివంతం అని నిరూపితమైంది.
శాకాహారం
మనిషి మనుగడకు, అంటే ఆకలికి ఆహారం మరియు శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ భూమి మీద సహజంగా పండే పళ్లూ కూరగాయల్లోనే లభ్యం అవడం మన అదృష్టం. కడుపు నింపుకోవడానికి తోటి జీవి ప్రాణం తియ్యవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదని చెప్తూ క్షేత్రానికి వచ్చే ధ్యానులకూ, సందర్శకులకూ స్వఛ్చమైన శ్రేష్టమైన శాకాహార భోజనం అందించడమే ఇక్కడి బ్రహ్మర్షి పత్రీజీ నిత్య అన్నదానం యొక్క ఉద్దేశం.
